Share News

లక్ష్య, శ్రీకాంత్‌ ముందంజ

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:23 AM

భారత సింగిల్స్‌ స్టార్‌ షట్లర్లు లక్ష్యసేన్‌, కిడాంబి శ్రీకాంత్‌ జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశారు...

లక్ష్య, శ్రీకాంత్‌ ముందంజ

కుమమొటొ (జపాన్‌): భారత సింగిల్స్‌ స్టార్‌ షట్లర్లు లక్ష్యసేన్‌, కిడాంబి శ్రీకాంత్‌ జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశారు. ఆరంభ రౌండ్లో 8వ సీడ్‌ లక్ష్యసేన్‌ 21-19, 21-18తో చైనీస్‌ తైపీ షట్లర్‌ చి యు జెన్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 18-21, 21-16, 24-22తో రాస్ముస్‌ జెమ్‌కె (డెన్మార్క్‌)ను ఓడించాడు. ఇక, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ రావత్‌/మనీషా ద్వయం 21-16, 14-21, 14-21తో యే హాంగ్‌/నికోల్‌ (తైపీ) జంట చేతిలో, హరిహరన్‌/తనీషా జోడీ 7-21, 9-21తో టాప్‌సీడ్‌ జంట జియాంగ్‌/వీ గ్జిన్‌ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:23 AM