Share News

కాకతీయ నైట్స్‌ రెండో గెలుపు

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:36 AM

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో ఆతిథ్య కాకతీయ నైట్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం నెక్లెస్‌ రోడ్‌లో...

కాకతీయ నైట్స్‌ రెండో గెలుపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో ఆతిథ్య కాకతీయ నైట్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం నెక్లెస్‌ రోడ్‌లో జరిగిన మూడో రోజు పోటీల్లో తమ మూడో లీగ్‌ మ్యాచ్‌లో కాకతీయ జట్టు 6-2తో రాజ్‌పుతానా రాయల్స్‌పై గెలుపొందింది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, నీరజ్‌ చౌహాన్‌ కాకతీయ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇతర మ్యాచ్‌ల్లో మైటీ మరాఠాస్‌ 6-0తో చోళ చీఫ్స్‌పై, పృథ్వీరాజ్‌ యోధాస్‌ సడెన్‌ డెత్‌తో 1-0తో చీరో ఆర్చర్స్‌పై నెగ్గాయి. ఉత్తమ కాంపౌండ్‌ ఆర్చర్‌ అవార్డు సురేఖకు, ఉత్తమ రికర్వ్‌ ఆర్చర్‌ అవార్డు నీరజ్‌కు దక్కాయి. ఆదివారం చీరో ఆర్చర్స్‌తో కాకతీయ నైట్స్‌, చోళ చీఫ్స్‌తో పృథ్వీరాజ్‌ యోధాస్‌, మైటీ మరాఠా్‌సతో రాజ్‌పుతానా రాయల్స్‌ తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి:

కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!

ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్

టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ

Updated Date - Oct 11 , 2026 | 05:36 AM