Share News

Joe Roots Century Powers England: శతక్కొట్టిన రూట్‌

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:15 AM

గత టెస్ట్‌ మాదిరిగా కాకుండా యాషెస్‌ సిరీస్‌ చివరి మ్యాచ్‌ ఐదు రోజులు కొనసాగేలా కనిపిస్తోంది. ఈ ఐదో టెస్ట్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 211/3తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన...

Joe Roots Century Powers England: శతక్కొట్టిన రూట్‌

  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 384

  • ఆస్ట్రేలియా 166/2 జూ యాషెస్‌ చివరి టెస్ట్‌

సిడ్నీ: గత టెస్ట్‌ మాదిరిగా కాకుండా యాషెస్‌ సిరీస్‌ చివరి మ్యాచ్‌ ఐదు రోజులు కొనసాగేలా కనిపిస్తోంది. ఈ ఐదో టెస్ట్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 211/3తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 384 పరుగులకు ఆలౌటైంది. కిందటి రోజు 72 పరుగులతో ఆడుతున్న రూట్‌ ఆస్ట్రేలియా గడ్డపై తన అత్యుత్తమ స్కోరు (160) సాధించాడు. అయితే బ్రూక్‌ (84) సెంచరీ మిస్సయ్యాడు. నేసర్‌ నాలుగు, బోలాండ్‌, స్టార్క్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ రెండో రోజు ఆఖరికి 166/2 స్కోరు చేసింది. హెడ్‌ (91), నేసర్‌ (1) క్రీజులో ఉన్నారు.

లబుషేన్‌ మెడ పట్టుకున్న స్టోక్స్‌: రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌, ఆసీస్‌ బ్యాటర్‌ లబుషేన్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. తన ఓవర్‌ను పూర్తి చేసి వెళ్తున్న స్టోక్స్‌నుద్దేశించి లబుషేన్‌ ఏదో అన్నాడు. దానికి స్టోక్స్‌... లబుషేన్‌ మెడచుట్టూ చేతులు వేసి ‘నోర్మూసుకో.. అని అనడమేకాదు ఓ అసభ్య పదంతో అతడిని దూషించాడు. అంపైర్లు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది.

3

టెస్ట్‌ల్లో అత్యధిక శతకాలు (41) చేసి పాంటింగ్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచిన రూట్‌. సచిన్‌ (51), కలిస్‌ (45) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:15 AM