జకార్తా ఇంటర్నేషనల్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్స్.. సిల్వర్‌తో మెరిసిన 'నారాయణ' విద్యార్థి
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:36 PM
నారాయణ స్కూల్స్‌కు చెందిన చిన్నారి, స్కేటింగ్ చిచ్చర పిడుగు ఖుషి రాజేష్ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఎస్ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకం కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: నారాయణ స్కూల్స్‌కు చెందిన చిన్నారి, స్కేటింగ్ చిచ్చర పిడుగు ఖుషి రాజేష్ అంతర్జాతీయ వేదికపై ఘన విజయం సాధించింది. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ప్రతిష్ఠాత్మక 'జకార్తా ఇంటర్నేషనల్ రోలర్ స్కేట్ కాంపిటీషన్ 2026'లో 400 మీటర్ల రిక్రియేషనల్ ఇన్-లైన్(అండర్-10) విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకం కైవసం చేసుకుంది.
స్పీడ్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SSFI) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో భారత్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, మయన్మార్ దేశాల నుంచి దాదాపు 1,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న ఈ కాంపిటీషన్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఖుషి.. తన అద్భుత ప్రతిభ, పట్టుదలతో రజత పతకాన్ని సాధించి దేశ కీర్తిని చాటిచెప్పింది.
ఈ విజయంపై ఖుషి రాజేష్ మాట్లాడుతూ.. 'నా ప్రయాణంలో నిరంతరం ప్రోత్సహిస్తూ సహకరించిన నా తల్లిదండ్రులకు, నారాయణ స్కూల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రజత పతకం సాధించిన ఖుషిని ప్రోత్సహిస్తూ.. నారాయణ స్కూల్స్ క్రీడా విభాగం nSports' తరఫున 'స్పోర్ట్స్ అచీవ్‌మెంట్ స్కాలర్‌షిప్' కింద రూ.10,000 నగదు బహుమతి అందించనున్నారు. ప్రస్తుతం ఖుషి తన తదుపరి లక్ష్యంగా 2వ స్టేట్ ర్యాంకింగ్ ఛాంపియన్ షిప్‌నకు సన్నాహాలు చేస్తోంది.
ఇవీ చదవండి:
సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత
మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు