అండర్-19 ప్రపంచకప్ ఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్..
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:36 AM
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఒమన్ వేదికగా ప్రారంభమైన టైటిల్ పోరులో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత యువ జట్టు బౌలింగ్ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాళ్లు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరిద్దరూ భారత క్రికెట్ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు కావడంతో అభిమానుల దృష్టి వారిపైనే ఉంది.
ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 208 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 48.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు సాధించింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ హంజా జహూర్ అజేయంగా 100 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇప్పుడు ఫైనల్లో భారత్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పాకిస్థాన్ మరోసారి భారత్‌ను ఓడించి టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ లక్ష్య రాజ్ రాయచందాని 93 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ఇవి కూడా చదవండి..
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ..
పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..