Share News

IND VS NZ: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - Jan 21 , 2026 | 06:49 PM

భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ(బుధవారం) తొలి టీ20 జరుగుతుంది. నాగ్ పూర్ వేదికగా మరికాసేపట్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కివీస్ జట్టు టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

IND VS NZ: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే..
India vs New Zealand T20

స్పోర్ట్స్ డెస్క్: భారత్, న్యూజిలాండ్(IND VS NZ) మధ్య ఇవాళ(బుధవారం) తొలి టీ20 జరగనుంది. నాగ్‌పూర్ వేదికగా మరికాసేపట్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కివీస్ జట్టు టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. భారత్, న్యూజిలాండ్ జట్లు దాదాపు మూడేళ్ల తర్వాత టీ20 ఫార్మాట్లో తలపడడనుండటం విశేషం. 2023 ఫిబ్రవరి 1న ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్168 పుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 25 మ్యాచులు జరిగాయి. భారత్ 14, కివీస్ 10 మ్యాచులు గెలిచాయి. ఒకదాంట్లో ఫలితం తేలలేదు.


తుది జట్టు:

భారత్:

సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్య, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్:

టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ


ఇవి కూడా చదవండి:

నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా: రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ

లిజెలీ లీకి షాక్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు

Updated Date - Jan 21 , 2026 | 10:36 PM