IND VS NZ: అర్ధ సెంచరీలతో రాణించిన కివీస్ ఓపెనర్లు..
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:37 PM
వడోదర వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ ఓడిన కివీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఓవైపు వికెట్లు కాపాడుకుంటూనే.. మరోవైపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఎట్టకేలకు హర్షిత్ రాణా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
స్పోర్ట్ డెస్క్: భారత్, న్యూజిలాండ్(India vs New Zealand)ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ(ఆదివారం) వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెనర్లు డేవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62)లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ పార్ట్‌నర్‌షిప్‌ను విడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు 21.4 ఓవర్లో హర్షిత్ రాణా టీమిండియాకు అందించాడు
62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికోల్స్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే హర్షిత్ మరో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 126 పరుగుల వద్ద కాన్వే రూపంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే.. ఈ ఓపెనర్లు ఇద్దరు ఆచితూచి ఆడి.. స్కోర్ బోర్డును మందుకు నడిపించారు. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill).. 20 ఓవర్లలోనే ఏడుగురు బౌలర్లను ప్రయోగించాల్సి వచ్చింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 26 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి.. 140 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్(10), డారెల్ మిచెల్(9) ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?