Share News

షఫాలీ ఆల్‌రౌండ్‌షో

ABN , Publish Date - Sep 19 , 2026 | 02:46 AM

ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో జపాన్‌పై భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. శ్రీచరణి నాలుగు వికెట్లు, షఫాలీ వర్మ 40 నాటౌట్‌తో రాణించారు. జపాన్‌ 57 పరుగులకు ఆలౌట్‌ కాగా, భారత్‌ 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

షఫాలీ ఆల్‌రౌండ్‌షో

  • సెమీస్‌లో భారత్‌ఫ జపాన్‌ చిత్తు

  • శ్రీచరణికి 4 వికెట్లు ఫ ఆసియా గేమ్స్‌ క్రికెట్‌

నిషిన్‌ (జపాన్‌): ఆసియా గేమ్స్‌ మహిళల క్రికెట్‌లో భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. పసికూన జపాన్‌ జట్టుతో శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (2/13; 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్‌) ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకుంది. ఇక ఆదివారం జరిగే సెమీ్‌సలో హర్మన్‌ప్రీత్‌ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జపాన్‌ 19.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది.


ఓపెనర్లు అయక కటో స్టాఫర్డ్‌ (25), హరుణ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించడం గమనార్హం. శ్రీచరణి (4-2-10-4) తన కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శనతో కట్టడి చేసింది. శ్రేయాంక, దీప్తి తలో వికెట్‌ తీశారు. అంతకుముందు పవర్‌ప్లే వరకు ఓపెనింగ్‌ జోడీ భారత బౌలర్లను నిలువరించగలిగింది. కానీ ఏడో ఓవర్‌లో శ్రీచరణి ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చింది. అయితే జపాన్‌ బ్యాటర్లు పరుగులు చేయకపోయినా.. బౌలర్లను విసిగిస్తూ ఆఖరి ఓవర్‌ వరకు ఇన్నింగ్స్‌ను తీసుకెళ్లగలిగారు.


ఆ తర్వాత స్వల్ప ఛేదనలో భారత్‌ 5 ఓవర్లలో 59/2 స్కోరు చేసి నెగ్గింది. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా.. షఫాలీ ఎదురుదాడికి దిగింది. ఐదో ఓవర్‌లో 20 పరుగులు రావడంతో మ్యాచ్‌ మరో 90 బంతులుండగానే ముగిసింది. భారత్‌ టీ20 కెరీర్‌లో బంతుల పరంగా ఇదే భారీ విజయం కావడం విశేషం. మరో క్వార్టర్స్‌లో మలేసియాపై శ్రీలంక జట్టు 86 పరుగుల తేడాతో గెలిచి సెమీ్‌సలో పాక్‌తో పోరుకు సిద్ధమైంది.


సంక్షిప్త స్కోర్లు: జపాన్‌: 19.5 ఓవర్లలో 57 ఆలౌట్‌ (అయక 20, హరుణ 10; శ్రీచరణి 4/10, షఫాలీ 2/13). భారత్‌: 5 ఓవర్లలో 59/2 (షఫాలీ 40 నాటౌట్‌, రిచా 12 నాటౌట్‌; యసుమోటో 1/8, అయక 1/14).


ఇవి కూడా చదవండి:

టెక్‌బాల్‌లో.. చరిత్రకు చేరువలో
ఇదిగో తెలుగు సైన్యం

Updated Date - Sep 19 , 2026 | 02:46 AM