అదరగొట్టిన భారత్
ABN , Publish Date - Sep 26 , 2026 | 02:39 AM
పనామాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి 1-1తో డ్రాగా ముగించింది.
1-1తో పనామాతో మ్యాచ్ డ్రా
స్నేహపూర్వక ఫుట్‌బాల్ పోరు
బెంగళూరు: పనామాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి 1-1తో డ్రాగా ముగించింది. భారత్ తరఫున రియాన్ విలియమ్స్ (41వ), పనామా నుంచి ఒమర్ వలెన్సియా (68వ) గోల్ సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 138వ స్థానంలో, పనామా 44వ స్థానంలో ఉన్నాయి. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో పనామా స్పష్టమైన ఫేవరెట్‌గానే బరిలోకి దిగింది.
కానీ ఆరంభం నుంచే భారత ప్లేయర్లు దూసుకెళ్లారు. దాదాపు 70 నిమిషాల పాటు ఆటను తమ ఆధీనంలోనే ఉంచుకుని పదేపదే ప్రత్యర్థి గోల్‌పో్‌స్టపై దా డులకు దిగారు. ఈక్రమంలో ప్రథమార్ధంలోనే రియాన్ విలియమ్స్ గోల్‌తో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆకాశ్ మిశ్రా అందించిన పాస్‌ను రియాన్ నేరుగా పోస్ట్‌లోకి పంపాడు. అయితే 68వ నిమిషంలో ఒమర్ వాలెన్సియా పనామాకు గోల్ అందించాడు.
ఈ వార్తలనూ చదవండి: