భారత్ హ్యాట్రిక్
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:57 AM
ఐదుసార్లు విజేత భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జోరు కొనసాగిస్తోంది.
జపాన్‌పై విజయం
చాంపియన్స్ ట్రోఫీ హాకీ
జలంధర్: ఐదుసార్లు విజేత భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జోరు కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 4-1తో జపాన్‌పై విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. స్ట్రయికర్ అభిషేక్ (11, 51ని.) రెండు గోల్స్‌తో అదరగొట్టాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (47ని.), విష్ణుకాంత్ సింగ్ (56ని.) చెరో గోల్ చేశారు. షోట యమాడ (15ని.) జపాన్‌కు ఏకైక గోల్ అందించాడు. ప్రారంభ మ్యాచ్‌లో 13-0తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్, రెండో పోరులో చైనాను 5-2తో ఓడించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగే మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడనుంది. ఇటీవలి నగోయ ఆసియా క్రీడల్లో భారత్ 5-1తో ఆ జట్టుపై గెలుపొందింది.
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!