Share News

భారత జట్ల హ్యాట్రిక్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:22 AM

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు హ్యాట్రిక్‌ విజయాలు సాధించాయి. మహిళలు గ్రీస్‌పై 3.5-0.5తో, పురుషులు ఇటలీపై 3-1తో గెలిచారు.

భారత జట్ల హ్యాట్రిక్‌
India Chess Olympiad 2026

  • చెస్‌ ఒలింపియాడ్‌

సమర్‌ఖండ్‌ (ఉజ్బెకిస్థాన్‌): చెస్‌ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్లు భారత పురుషులు, మహిళల జట్లు హ్యాట్రిక్‌ విజయాలు దక్కించుకున్నాయి. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో మహిళల జట్టు 3.5-0.5 స్కోరుతో గ్రీస్‌ను చిత్తు చేసింది. కోనేరు హంపి, వంతిక, సావిత్రి శ్రీ గెలుపొందగా, దివ్యా దేశ్‌ముఖ్‌ డ్రా చేసుకుంది. ఓపెన్‌లో..పురుషుల జట్టు 3-1 స్కోరుతో ఇటలీని ఓడించింది. గుకేష్‌, నిహాల్‌ సరీన్‌ విజయాలు సాధించగా, ప్రజ్ఞానంద, అర్జున్‌ పాయింట్లు పంచుకున్నారు.


ఇవి కూడా చదవండి:

‘ఆసియా’ను గెలవాలని..
ఆసియా గేమ్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

Updated Date - Sep 19 , 2026 | 03:23 AM