నేటినుంచే మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:59 AM
మంగళగిరిలో మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు జట్లు పాల్గొనే టోర్నీలో 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. నారా బ్రాహ్మణి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా, మ్యాచ్‌లకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించారు.
ప్రారంభించనున్న నారా బ్రాహ్మణి
మంగళగిరి సిటీ (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళల టీ-20 క్రికెట్ సందడి శనివారం మొదలుకానుంది. స్థానిక ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలు 27వ తేదీ వరకు జరగనున్నాయి. టోర్నీలో పాల్గొనే నాలుగు జట్ల క్రీడాకారిణులు గురువారమే ఇక్కడికి చేరుకుని ప్రాక్టీస్ సెషన్లలో నిమగ్నమయ్యారు.
ఈ పోటీల ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మొత్తం 13 మ్యాచ్‌లు జరుగనుండగా, మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రీడాభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. టోర్నీకి తొలి రోజైన శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్, సాయంత్రం 6 గంటలకు వైజాగ్ ఫైర్ బర్డ్స్, అమరావతి ఈ-చాంపియన్స్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. 27వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ఫైనల్ జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
పెళ్లికి ముందే బ్రేకప్