Share News

ఫైనల్లో భారత్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:30 AM

జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత హాకీ జట్టు రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు...

ఫైనల్లో భారత్‌

  • సెమీస్‌లో కొరియాపై 8-1తో విజయం

  • నేటి తుది పోరులో జపాన్‌తో ఢీ

  • ఆసియా చాంపియన్స్‌ హాకీ ట్రోఫీ

మొహాలీ: జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత హాకీ జట్టు రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 8-1తో కొరియాను చిత్తు చేసింది. శైలేంద్ర లక్రా (4వ, 13వ నిమిషం), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (21వ, 25వ) రెండేసి గోల్స్‌ చేయగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (9వ), సుఖ్‌జీత్‌ సింగ్‌ (21వ), అంగద్‌సింగ్‌ (36వ), వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (54వ) తలో గోల్‌ సాధించారు. కొరియా తరఫున సంగ్‌జున్‌ హాన్‌ (9వ) ఏకైక గోల్‌ చేశాడు. గురువారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో జపాన్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీ్‌సలో జపాన్‌ షూటౌట్‌లో 5-3తో మలేసియాపై గెలిచింది.

ఇవి కూడా చదవండి:

WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ

అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్

సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!

Updated Date - Nov 05 , 2026 | 04:30 AM