Share News

హర్మన్‌, సుఖ్‌జీత్‌ డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:35 AM

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, స్ట్రయికర్‌ సుఖ్‌జీత్‌ సింగ్‌ డబుల్‌ ధమాకా సృష్టించడంతో.. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో...

హర్మన్‌, సుఖ్‌జీత్‌ డబుల్‌ ధమాకా

5-2తో చైనాపై భారత్‌ గెలుపుఫ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ

జలంధర్‌: కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, స్ట్రయికర్‌ సుఖ్‌జీత్‌ సింగ్‌ డబుల్‌ ధమాకా సృష్టించడంతో.. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5-2తో చైనాను ఓడించింది. సుఖ్‌జీత్‌ (12వ, 34వ) రెండు ఫీల్డ్‌ గోల్స్‌ చేయగా.. డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ (27వ, 31వ), జుగ్‌రాజ్‌ సింగ్‌ (47వ) పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచారు. చైనాకు లభించిన పీసీలను పెంగ్‌ యాంగ్‌ (26వ), చోంగ్‌ కాంగ్‌ చెన్‌ (36వ) గోల్‌లోకి పంపారు. ఇతర మ్యాచ్‌ల్లో ఆసియాడ్‌ రజత పతక విజేత మలేసియా 3-1తో దక్షిణ కొరియాపై, జపాన్‌ 1-0తో బంగ్లాదేశ్‌పై గెలిచాయి.

ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు

Updated Date - Oct 30 , 2026 | 05:35 AM