భారత కుర్రాళ్లదే విజయం
ABN , Publish Date - Sep 26 , 2026 | 02:51 AM
ఆస్ట్రేలియా-ఎతో తొలి అనధికారిక టెస్టులో భారత్-ఎ జట్టు 162 పరుగుల తేడాతో గెలిచింది. 363 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 55/2తో చివరి రోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 200 పరుగులకు కుప్పకూలింది.
ఆస్ట్రేలియా ఎతో తొలి టెస్టు
పుదుచ్చేరి: ఆస్ట్రేలియా-ఎతో తొలి అనధికారిక టెస్టులో భారత్-ఎ జట్టు 162 పరుగుల తేడాతో గెలిచింది. 363 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 55/2తో చివరి రోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 200 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే (8-2-14-3)ప్రత్యర్థి పనిపట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 334, ఆసీస్ 171 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 199 రన్స్ సాధించింది.
చెస్‌లో భారత్‌కు విజయాలు
సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్థాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత ఓపెన్, మహిళల జట్లు తొమ్మిదో రౌండ్‌ను విజయంతో ముగించాయి. శుక్రవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో భారత మహిళల జట్టు 3-1తో ఆతిథ్య ఉజ్బెకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. మొత్తం 11 రౌండ్ల ఈ పోటీల్లో మరో రెండు రౌండ్లు మిగిలున్నాయి.
ఈ వార్తలనూ చదవండి: