ఫైనల్లో గోదావరి, రాయలసీమ
ABN , Publish Date - Sep 26 , 2026 | 02:45 AM
గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్‌స్టార్స్ జట్లు మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు చేరుకున్నాయి.
మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్
మంగళగిరి సిటీ (ఆంధ్రజ్యోతి): గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్‌స్టార్స్ జట్లు మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు చేరుకున్నాయి. మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో గోదావరి జట్టు 27 పరుగుల తేడాతో వైజాగ్ ఫైర్ బర్డ్స్‌ను, రెండో మ్యాచ్‌లో రాయలసీమ జట్టు 32 పరుగులతో అమరావతి ఈ-చాంపియన్స్‌ను ఓడించాయి. మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గోదావరి నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 156 పరుగులు చేసింది.
పుష్పిత 56 బంతుల్లో 91 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ హెన్రిట్టా పెరీరా 29 బంతుల్లో 34 పరుగులు చేశారు. అనంతరం వైజాగ్ ఫైర్ బర్డ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 129/8 పరుగులు మాత్రమే చేయగలిగింది. యశస్విని 23, హాసిని 20 రన్స్ సాధించారు. గోదావరి బౌలర్లు శ్రిష్టి శేఖర్ 2, వైష్ణవి, హారిక, అక్షయ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. పుష్పితకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మరో మ్యాచ్‌లో తొలుత రాయలసీమ జట్టు నిర్ణీత ఓవర్లలో 172/5 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పద్మజ (61 నాటౌట్) హాఫ్ సెంచరీ చేసింది. లక్ష్యఛేదనలో అమరావతి జట్టు కేవలం 140 పరుగులకే పరిమితమైంది. దీక్ష (42), దేవిక (39), అనూష (26) రాణించారు. జెన్ స్టార్స్ బౌలర్ పావని (4/23) అద్భుతంగా బౌలింగ్ చేసింది.
ఈ వార్తలనూ చదవండి: