Share News

హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్‌తో మ్యాచ్ డ్రా.. రెండో రౌండ్‌కు భారత్

ABN , Publish Date - Aug 20 , 2026 | 09:41 PM

హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పూల్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ 0-0తో డ్రాగా నిలిచింది.

హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్‌తో మ్యాచ్ డ్రా.. రెండో రౌండ్‌కు భారత్
Hockey World Cup

ఇంటర్నెట్ డెస్క్: హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పూల్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ 0-0తో డ్రాగా నిలిచింది. ఇంగ్లండ్‌ ప్లేయర్లు గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. భారత ప్లేయర్లు అద్భుతంగా ప్రతిఘటించి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇంగ్లండ్‌ పదేపదే భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినా.. భారత డిఫెన్స్‌ సమష్టిగా అడ్డుకుంది. కీలక సమయాల్లో గోల్‌కీపర్‌ సహా భారత రక్షణ శ్రేణి పట్టుదలతో ఆడి స్కోరును సమం చేసింది.


ఈ డ్రాతో భారత్‌ ఐదు పాయింట్లు సాధించి పూల్‌-డి నుంచి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మరోవైపు నాలుగు పాయింట్లతో ఉన్న ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్‌ను నిలువరించి కీలక పాయింట్‌ సాధించిన భారత్‌.. ఇప్పుడు రెండో రౌండ్‌లో మరింత కఠినమైన పోరుకు సిద్ధమవుతోంది. పతక లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఈ ఫలితం మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించనుంది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సింధు, ఆయుష్ ఔట్

ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్

Updated Date - Aug 20 , 2026 | 09:41 PM