అబ్బే..నాకు తెలీదు!
ABN , Publish Date - Aug 01 , 2026 | 05:20 AM
భారత పురుషులు, మహిళల హాకీ జట్ల జెర్సీని కాషాయ రంగుకు మార్చడంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కే స్పందించాడు....
మాట మార్చిన హెచ్‌ఐ చీఫ్ టిర్కే
హాకీ జట్ల కాషాయ జెర్సీపై ముదిరిన వివాదం
న్యూఢిల్లీ: భారత పురుషులు, మహిళల హాకీ జట్ల జెర్సీని కాషాయ రంగుకు మార్చడంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కే స్పందించాడు. ఈ నిర్ణయం తనకు తెలియకుండా తీసుకున్నారని స్పష్టంజేశాడు. సాధారణంగా భారత జట్ల జెర్సీ నీలిరంగులో ఉంటుంది. కానీ ఈనెల 15 నుంచి జరిగే వరల్డ్ కప్‌నకు ఆ రంగు మార్చి కాషాయ జెర్సీలను ఖరారు చేయడం వివాదానికి దారి తీసింది. అయితే..హాకీ టర్ఫ్, భారత జట్ల జెర్సీలు నీలి రంగులోనే ఉన్నాయని, దానిని నివారించేందుకు కాషాయానికి మార్చినట్టు చెప్పిన టిర్కే.. విమర్శలు రావడంతో మాట మార్చాడు. ‘ముందు చెప్పకుండా, హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో చర్చించకుండా జెర్సీని కాషాయ రంగుకు మార్చారు’ అని హెచ్‌ఐ అధికారులకు అంతర్గతంగా పంపిన సమాచారంలో దిలీప్ పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై తనకు వివరణ ఇవ్వాలని అతడు సంబంధిత అధికారులను కోరినట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News