హర్మన్ హ్యాట్రిక్
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:09 AM
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఆతిథ్య భారత్ జోరు మామూలుగా లేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో దుమ్ము రేపడంతో...
మలేసియాపై భారత్ గెలుపు
చాంపియన్స్ ట్రోఫీ హాకీ
జలంధర్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఆతిథ్య భారత్ జోరు మామూలుగా లేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో దుమ్ము రేపడంతో మన జట్టు లీగ్ దశలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4-2తో మలేసియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ (3వ, 33వ, 58వ నిమిషం) మూడు గోల్స్‌తో మురిపించాడు. స్ట్రయికర్ సుఖ్‌జీత్ సింగ్ (43 ని) మరో గోల్ చేశాడు. అఖిముల్లా అన్వర్ (25 ని), షెల్లో సిల్వేరియస్ (60 ని) మలేసియాకు గోల్స్ అందించారు. ఆరు జట్ల ఈ టోర్నీలో భారత్, మలేసియాతోపాటు జపాన్, దక్షిణ కొరియా ఇప్పటికే సెమీఫైనల్లో ప్రవేశించాయి. సోమవారం జరిగే ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది. ఆదివారం జరిగిన ఇతర మ్యాచుల్లో దక్షిణ కొరియా 5-0తో బంగ్లాదేశ్‌పై గెలుపొందగా.. చైనా, జపాన్ జట్ల మధ్య పోరు 2-2తో డ్రాగా ముగిసింది.
ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ
ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..
5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్