Shikhar Dhawan: మళ్లీ పెళ్లి చేసుకోనున్న ధవన్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:05 AM
భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ (40) మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ (36)తో ధవన్ ఏడాది...
న్యూఢిల్లీ: భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ (40) మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ (36)తో ధవన్ ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నాడు. సోఫీ అబుధాబిలోని ఓ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. అయితే వచ్చే నెలలో ఈ జోడీ వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. గతంలో ధవన్‌కు ఆస్ర్టేలియాకు చెందిన కిక్ బాక్సర్ ఆయేషా ముఖర్జీతో వివాహమైనప్పటికీ 2023లో విడాకులు తీసుకున్నాడు. వీరికి 11 ఏళ్ల కుమారుడున్నాడు. ధవన్‌కంటే ముందు తొలి వివాహంలో ఆయేషాకు ఇద్దరు కుమార్తెలున్నారు.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి