Share News

క్వార్టర్‌ఫైనల్లో గాయత్రి జోడీ

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:58 AM

డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో గాయత్రి ద్వయం క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. కిడాంబి శ్రీకాంత్‌,...

క్వార్టర్‌ఫైనల్లో గాయత్రి జోడీ

  • శ్రీకాంత్‌, అస్మిత ఓటమి

  • డెన్మార్క్‌ ఓపెన్‌

ఒడెన్స్‌ (డెన్మార్క్‌): డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో గాయత్రి ద్వయం క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. కిడాంబి శ్రీకాంత్‌, అస్మిత చాలిహా ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. గురువారం జరిగిన రౌండ్‌-16 మహిళల డబుల్స్‌ మ్యాచ్‌లో గాయత్రి గోపీచంద్‌/ట్రిసా జాలీ జంట 21-16, 21-17తో రాచెల్‌/సెటియానిన్‌గ్రమ్‌ (ఇండోనేసియా) జోడీపై గెలుపొందింది. సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 21-11, 15-21, 15-21తో లానియర్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక అస్మిత 18-21, 10-21తో అకానె యమగూచి చేతిలో పరాజయం పాలైంది.

Also Read:

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

Updated Date - Oct 16 , 2026 | 05:58 AM