Share News

రొనాల్డోపై వేటు

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:29 AM

మేనేజర్‌ జార్జ్‌ జీసెస్‌తో విభేదాల కారణంగా అర్ధంతరంగా పోర్చుగల్‌ జట్టు శిక్షణ శిబిరాన్ని వీడడంతో.. సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోపై...

రొనాల్డోపై వేటు

లిస్బన్‌: మేనేజర్‌ జార్జ్‌ జీసెస్‌తో విభేదాల కారణంగా అర్ధంతరంగా పోర్చుగల్‌ జట్టు శిక్షణ శిబిరాన్ని వీడడంతో.. సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోపై పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య క్రమశిక్షణ చర్యలు తీసుకొంది. అతడిపై తాత్కాలికంగా నిషేధం విధించింది. యూఈఎ్‌ఫఏ నేషన్స్‌ లీగ్‌లో నార్వేతో మ్యాచ్‌ సందర్భంగా తనను బెంచ్‌కే పరిమితం చేయడంపై రొనాల్డో కినుక వహించాడు. దీంతో జాతీయ జట్టును వీడి అతడు తాను ప్రాతినిథ్యం వహించే క్లబ్‌ జట్టు ఆల్‌ నాసర్‌ క్యాంప్‌నకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో రొనాల్డో విషయమై దర్యాప్తు చేయాల్సిందిగా క్రమశిక్షణ కమిటీకి జాతీయ సమాఖ్య సిఫార్సు చేసింది. నిబంధనల ప్రకారం ఇలా జట్టును వీడితే 6 నెలల నిషేధం, జరిమానా పడే చాన్సుంది. కాగా, నాలుగు రోజుల క్రితం ఈ విషయమై రొనాల్డో క్షమాపణలు కోరుతూ సోషల్‌ మీడియాలో పోస్టు కూడా పెట్టాడు.

ఇవి కూడా చదవండి:

కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!

ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్

టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ

Updated Date - Oct 11 , 2026 | 02:30 AM