టీ20 ప్రపంచ కప్2026: వరుస వికెట్లతో వరుణ్ చక్రవర్తి రికార్డ్
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:43 PM
టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ రికార్డ్‌ను సమం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ 2026లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తాజాగా వరుణ్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్‌గా నిలిచాడు. నిన్న(బుధవారం) నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా వరుణ్ చక్రవర్తి ఈ ఫీట్‌ను సాధించాడు.
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి.. తన మిస్టరీ స్పిన్‌తో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. పవర్ ప్లే ఆఖరి ఓవర్ నాలుగో బంతికి నెదర్లాండ్స్ ఓపెనర్ మాక్స్ ఓ డౌడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో వరుసగా అత్యధిక మ్యాచుల్లో వికెట్లు తీసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నెదర్లాండ్స్ బ్యాటర్ ఓడౌడ్ వికెట్.. అంతర్జాతీయ టీ20ల్లో వరుణ్‌కి వరుసగా 17వ మ్యాచ్‌లో దక్కిన వికెట్ కావడం గమన్హారం.
అలానే టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జూన్ 2024 నుంచి డిసెంబర్ 2025 మధ్య భారత్ తరఫున వరుసగా 17 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్‌ను సాధించాడు. తాజాగా నెదర్లాండ్స్ మ్యాచ్‌లో వికెట్లు తీయడం ద్వారా వరుణ్ చక్రవర్తి.. అర్ష్‌దీప్ సింగ్ రికార్డ్‌ను సమం చేశాడు. అతను 2025 నుంచి నిన్న(బుధవారం)నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ వరకు వరుసగా 17 మ్యాచ్‌ల్లో వికెట్లు తీశాడు. ఈ 17 మ్యాచ్‌ల్లో వరుణ్ చక్రవర్తి మొత్తం 31 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ఉన్నాడు. నెహ్రా వరుసగా 13 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్ పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..
నువ్వు అద్భుతం.. పాకిస్థాన్ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు