Share News

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట విషాదం

ABN , Publish Date - Jun 24 , 2026 | 02:57 PM

పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం నెలకొంది. అతడి అన్న షాహిద్ అక్తర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్తర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట విషాదం
Shoaib Akhtar

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్తర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. షాహిద్ అక్తర్ మంగళవారం అర్ధరాత్రి సమయంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.Shoaib-Akhtar.jpg


'నా ప్రియమైన సోదరుడు షాహిద్ అక్తర్ అల్లా చెంతకు చేరారు. అతడి మృతిపై నేను ఎంతగానో విచారిస్తున్నాను' అంటూ అక్తర్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. మరోవైపు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. హెచ్-8 స్మశానవాటికలో అంత్యక్రియల ప్రార్థనలు జరుగుతాయని, షాహిద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని అతడు ఫేస్‌బుక్‌ ద్వారా కోరాడు. అయితే షాహిద్ అక్తర్ మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.


దాదాపు ఐదేళ్ల క్రితం అంటే 2021లో అక్తర్ తన మాతృమూర్తి కోల్పోయాడు. ఆ సమయంలో అక్తర్‌కు షాహిద్ అక్తర్ అండగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అన్నయ్యను కూడా కోల్పోవడంతో అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు మాజీ పాక్ క్రికెటర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు సోషల్ మీడియా ద్వారా అక్తర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అక్తర్ క్రీడా విశ్లేషకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల ముగిసిన 2026 టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆయన పాక్ మీడియా ఛానళ్లలో నిపుణుడిగా వ్యవహరించాడు.


ఇవి కూడా చదవండి:

స్టోక్స్‌తో విభేదాలు.. పుకార్లను కొట్టిపారేసిన మెక్‌కల్లమ్

ఆసియా క్రీడలు: నన్ను ఎందుకు తప్పించారో వివరణ ఇవ్వండి: మానికా బాత్రా

Updated Date - Jun 24 , 2026 | 03:46 PM