Share News

కొత్త పిచ్‌ ఎలా స్పందిస్తుందో..

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:24 AM

ఉప్పల్‌ స్టేడియంలో సరికొత్తగా రూపొందించిన పిచ్‌.. ఎలా స్పందిస్తుందో చూడాలన్న ఆసక్తి అందరిలాగే...

కొత్త పిచ్‌ ఎలా స్పందిస్తుందో..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఉప్పల్‌ స్టేడియంలో సరికొత్తగా రూపొందించిన పిచ్‌.. ఎలా స్పందిస్తుందో చూడాలన్న ఆసక్తి అందరిలాగే తనకూ ఉన్నదని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ అన్నాడు. బుధవారం భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య నాలుగో టీ20 ఇక్కడ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో తిలక్‌ మాట్లాడుతూ.. ఉప్పల్‌ మైదానంపై తనతో పాటు నితీశ్‌, ఇషాన్‌, అభిషేక్‌కు చక్కటి అవగాహన ఉందని, ఇది తమకు కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. విధ్వంసకర బ్యాటర్లకు పెట్టింది పేరైన కరీబయిన్లను అడ్డుకోవడానికి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాల్సిందేనని, అందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. ఇక, వ్యక్తిగతంగా తనకు వన్‌డౌన్‌లో బరిలోకి దిగడం ఇష్టమని, అయితే జట్టు ప్రస్తుత అవసరాల దృష్ట్యా మిడిలార్డర్‌లో ఆడుతున్నానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 14 , 2026 | 06:24 AM