‘ఆరే’సిన తన్మయ్
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:18 AM
లెఫ్టామ్ స్పిన్నర్ తన్మయ్ బలోడా (6/32) ఆరు వికెట్లతో చెలరేగడంతో భారత్ అండర్-19 జట్టుతో సోమవారం..
ఆస్ట్రేలియా ‘ఎ’ 174 ఆలౌట్
అహ్మదాబాద్: లెఫ్టామ్ స్పిన్నర్ తన్మయ్ బలోడా (6/32) ఆరు వికెట్లతో చెలరేగడంతో భారత్ అండర్-19 జట్టుతో సోమవారం మొదలైన రెండో అనధికార టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. చార్లీ హెండర్సన్ (37), నీల్ పటేల్ (31) మాత్రమే రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ అండర్-19 ఆట ఆఖరికి 38/2 స్కోరు చేసింది. ప్రత్యర్థి జట్టు స్కోరుకు యువ భారత్ 136 పరుగులు వెనుకంజలో నిలిచింది.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..