Share News

భారతీయ ఫ్రాంచైజీలకు సునీల్ గావస్కర్ వార్నింగ్..

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:59 PM

ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్‌ లీగ్'కు సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

భారతీయ ఫ్రాంచైజీలకు సునీల్ గావస్కర్ వార్నింగ్..
Sunil Gavaskar Pakistan Players

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్‌ లీగ్'కు సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడం పట్ల సోషల్‌ మీడియాలో అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) కూడా భారత్ కు చెందిన ఫ్రాంచైజీలు పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘ది హండ్రెడ్‌ టోర్నీలో ఒక ప్రాంచైజీ పాకిస్థాన్‌ ఆటగాళ్లను(Pakistan Players) కొనుగోలు చేయడం మాములు విషయమే. కానీ భారత్‌కు చెందిన ఒక ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పాక్‌ ప్లేయర్ ను కొనుగోలు చేయడం ఆశ్చర్యమే. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత నుంచి ఐపీఎల్ లో పాకిస్థాన్ ప్లేయర్లను బహిష్కరించాము. కానీ తాజాగా సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేసింది' అని తెలిపారు.


'తనకు ఫీజు రూపంలో వచ్చిన మొత్తానికి పాకిస్థానీ ప్లేయర్‌ తన ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తాడు. ఆ సొమ్ముతో అతడి ప్రభుత్వం ఆయుధాలను కొనుగోలు చేసి.. భారత్‌ పైనే ప్రయోగిస్తుంది. అంటే పాక్‌ ఆటగాళ్లకు చెల్లించే ఫీజు పరోక్షంగా మన ప్రజలు, సైనికుల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. అందుకే అభిమానుల ఆగ్రహంలో నాకు తప్పు కనిపించలేదు. ఎవరైనా సరే పాక్‌ ఆటగాళ్లను సినిమా వారిని పక్కన పెట్టేయాల్సిందే. భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు’ అని గావస్కర్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!

Updated Date - Mar 16 , 2026 | 05:42 PM