ఐపీఎల్ ఆటగాళ్ల ట్రేడింగ్ పారదర్శకత ఉండాలి: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:59 PM
ఐపీఎల్ ట్రేడింగ్ వ్యవస్థపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్రేడింగ్ వ్యవస్థలో పారదర్శకత కొరవడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ ట్రేడింగ్ వ్యవస్థపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్రేడింగ్ వ్యవస్థలో పారదర్శకత కొరవడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల మధ్య జరిగే ఆటగాళ్ల బదిలీలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలను బహిర్గతం చేయాలని ఆయన బీసీసీఐని కోరారు. తన ‘మిడ్-డే’ కాలమ్‌లో గావస్కర్ ఈ అంశంపై బీసీసీఐకి స్పష్టమైన విజ్ఞప్తి చేశారు.
ఐపీఎల్‌లో సాధారణంగా జరిగే వేలం (Auction) పద్ధతికి భిన్నంగా ఆఫ్‌సీజన్‌లో ఫ్రాంచైజీలు నేరుగా ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంటుంటాయి. అయితే, ఈ ప్రక్రియలో ఆటగాడిని కొనుగోలు చేసిన ధర లేదా ఆర్థిక వివరాలు కేవలం సంబంధిత రెండు ఫ్రాంచైజీలు, ఆటగాడికి, అలానే బీసీసీఐకి మాత్రమే తెలుస్తున్నాయని గావస్కర్ గుర్తుచేశారు. దీనివల్ల మిగతా జట్లకు ఆ సమాచారం తెలియక, అవి నిర్దేశిత వేతన నిబంధనలను పాటిస్తున్నాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
'ఒక ఫ్రాంచైజీ నుంచి మరొకదానికి ఆటగాడి మార్పిడి బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ, ట్రేడింగ్ జరిగేటప్పుడు వెచ్చించిన మొత్తం మాత్రం గోప్యంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇతర జట్లకు కూడా ఆ ట్రేడింగ్ తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆటగాళ్ల జీతాల పరిమితి నిబంధనలను అందరూ సరిగ్గా పాటిస్తున్నారనే స్పష్టత వస్తుంది. కాబట్టి బీసీసీఐ ఈ విషయంలో పూర్తి పారదర్శకత పాటించి, ట్రేడింగ్ మొత్తాలను ప్రేక్షకులకు, ఇతర ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంచాలి' అని గావస్కర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
నా ఫుట్‌బాల్ కెరీర్‌కు వచ్చే ఏడాదే చివరిది కావచ్చు: రొనాల్డో
పడిక్కల్ ఒక అరుదైన బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం