పట్టుబిగించిన దక్షిణాఫ్రికా
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:08 AM
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఆతిథ్య జట్టు...
బంగ్లాతో మొదటి టెస్ట్
జోహన్నస్‌బర్గ్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఆతిథ్య జట్టు.. బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టింది. వెలుతురు లేమితో బుధవారం ఆట ఆపివేసే సరికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 100/5 స్కోరుతో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 386/7తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు 557 పరుగుల భారీస్కోరు చేశారు. బంగ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 400 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
లిట్టన్‌దాస్ ప్రపంచ రికార్డు: బంగ్లాదేశ్‌కు చెందిన లిట్టన్‌దాస్ టెస్ట్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక (8) ఆటగాళ్లను అవుట్ చేసిన కీపర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో లిట్టన్ 6 క్యాచ్‌లు, 2 స్టంపింగ్‌లతో ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?
రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!