Share News

హార్మర్‌ ‘సిక్సర్‌’.. సఫారీలదే సిరీస్‌

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:43 AM

ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో దక్షిణాఫ్రికా దక్కించుకుంది. శనివారం ముగిసిన ఆఖరి టెస్టులో...

హార్మర్‌ ‘సిక్సర్‌’..  సఫారీలదే సిరీస్‌

మూడో టెస్టులో ఆసీస్‌ ఓటమి

బవుమా సేనకు నెంబర్‌వన్‌ ర్యాంకు

కేప్‌టౌన్‌: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో దక్షిణాఫ్రికా దక్కించుకుంది. శనివారం ముగిసిన ఆఖరి టెస్టులో సఫారీలు 176 పరుగులతో ఘనవిజయం సాధించారు. ఆసీస్‌ తొలి టెస్టు మాత్రమే నెగ్గింది. ఈ గెలుపుతో బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు టెస్టుల్లో నెంబర్‌వన్‌గా నిలవడం విశేషం. 288 పరుగుల ఛేదన కోసం చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌.. స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ (6/16) ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. పదో నెంబర్‌ బ్యాటర్‌ లియోన్‌ (33 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌. పేసర్‌ రబాడకు 3 వికెట్లు దక్కాయి. దీంతో టెస్టుల్లో వేగంగా (13808 బంతుల్లో) 350 వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 329, ఆసీస్‌ 429 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 387 రన్స్‌ చేసింది.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య

పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!

Updated Date - Nov 01 , 2026 | 03:43 AM