Share News

‘ఢిల్లీ’ చీఫ్‌ కోచ్‌ గంగూలీ

ABN , Publish Date - Oct 07 , 2026 | 02:58 AM

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు...

‘ఢిల్లీ’ చీఫ్‌ కోచ్‌ గంగూలీ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. ‘ఢిల్లీ.. ఇక దాదాగిరి చేసే సమయం వచ్చేసింది. హేమంగ్‌ బదాని స్థానంలో చీఫ్‌ కోచ్‌గా గంగూలీ’ అని ఢిల్లీ యాజమాన్యం మంగళవారం సోషల్‌ మీడియాలో ప్రకటించింది. కాగా, గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్‌తో అనుబంధం ఎప్పటినుంచో ఉంది. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సలహాదారుగా జట్టులో చేరిన ఆయన.. క్యాపిటల్స్‌ పురుషులు, మహిళల జట్లకు క్రికెట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. గతేడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రిటోరియా క్యాపిటల్స్‌కు హెడ్‌ కోచ్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు.

ఈ వార్తలూ చదవండి

విండీస్ 171 పరుగులకు ఆలౌట్.. భారత్ లక్ష్యం 172..

వైభవ్‌తో బ్యాటింగ్ చేస్తే ఒత్తిడే ఉండదు: ప్రియాంశ్ ఆర్య

Updated Date - Oct 07 , 2026 | 02:58 AM