ప్రయోగాలకు సమయం లేదు
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:53 AM
వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ సమయానికి భారత్ ఆడే మ్యాచ్‌లు తక్కువే అని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. అందుకే జట్టులో ఎలాంటి...
చండీగఢ్: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ సమయానికి భారత్ ఆడే మ్యాచ్‌లు తక్కువే అని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. అందుకే జట్టులో ఎలాంటి ప్రయోగాలుండవని స్పష్టం చేశాడు. ఇప్పుడు అందుబాటులో ఉన్నవారే న్యూజిలాండ్‌తో వన్డే సిరీ్‌సలోనూ ఆడతారని, సీనియర్లకు విశ్రాంతినివ్వాల్సిన అవసరం లేదన్నాడు. వన్డే వరల్డ్‌క్‌పలో రోహిత్, రాహుల్ పాత్ర కీలకమని, వారంతా సెంచరీలతో సత్తా చాటుకోవడం శుభసూచకమని గిల్ పేర్కొన్నాడు. ఐదు వన్డేలు, ఐదు టీ20ల సుదీర్ఘ పర్యటన కోసం ఈనెల మూడో వారంలో కివీస్‌కు భారత్ వెళ్లనుంది.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..