టాప్-10లోకి శ్రేయాస్
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:38 AM
టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. వెస్టిండీ్‌సతో తొలి టీ20లో సెంచరీతో...
ఏడో ర్యాంక్‌తో కెరీర్ బెస్ట్‌ఫ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్: టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. వెస్టిండీ్‌సతో తొలి టీ20లో సెంచరీతో సత్తా చాటడంతో శ్రేయాస్.. తాజా ర్యాంకింగ్స్ బ్యాటర్ల విభాగంలో ఏకంగా టాప్-10లోకి దూసుకొచ్చాడు. 18 స్థానాలు మెరుగుపరచుకొని ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. అయ్యర్‌కు ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. ఇషాన్ కిషన్ నెంబర్‌వన్‌లో, అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. తిలక్ వర్మ పదో ర్యాంక్‌లో ఉన్నాడు. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ 8 స్థానాలు ఎగబాకి 46వ ర్యాంకులో నిలిచాడు. టీ20 బౌలర్లలో అక్షర్ పటేల్ ఏకంగా 16 స్థానాలు మెరుగై ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. వన్డే బ్యాటర్లలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెంబర్‌వన్ ర్యాంక్‌ను పటిష్టం చేసుకున్నాడు. ఇటీవల కేఎల్ రాహుల్ ఏడు స్థానాలు మెరుగై పదో ర్యాంక్‌కు ఎగబాకగా.. కోహ్లీ రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయాడు.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి