Share News

భారత్‌-ఎ జట్టులో షబ్నం, హెన్రిటా

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:29 AM

స్వదేశంలో ఇంగ్లండ్‌-ఎతో జరిగే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ల్లో తెలుగు ప్లేయర్లు హెన్రిటా పెరీరా, షబ్నం షకీల్‌కు భారత్‌-ఎ జట్టులో..

భారత్‌-ఎ జట్టులో షబ్నం, హెన్రిటా

ఇంగ్లండ్‌-ఎతో సిరీస్‌లకు ఎంపిక

న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌-ఎతో జరిగే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ల్లో తెలుగు ప్లేయర్లు హెన్రిటా పెరీరా, షబ్నం షకీల్‌కు భారత్‌-ఎ జట్టులో చోటుదక్కింది. బుధవారం ప్రకటించిన జట్లలో మల్టీ డే ఫార్మాట్‌ మ్యాచ్‌కు పెరీరా, షబ్నం ఎంపిక కాగా.. వన్డే టీమ్‌లో షకీల్‌కు చోటు లభించింది. కాగా, ఆల్‌రౌండర్‌ శ్రేయాంక పాటిల్‌ రీఎంట్రీ ఇచ్చింది. వైట్‌బాల్‌ సిరీస్‌లకు అనుష్క శర్మ, మల్టీ డే ఫార్మాట్‌కు మిన్నూ మణి సారథ్యం వహించనున్నారు. మూడు టీ20ల సిరీస్‌ పుణెలో ఈ నెల 30 నుంచి జరగనుండగా.. వచ్చే నెల 8 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌, 19 నుంచి జరిగే ఏకైక రెడ్‌బాల్‌ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!

కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?

Updated Date - Nov 12 , 2026 | 03:29 AM