Share News

సకీబ్‌ ఖాన్‌కు ఏడు వికెట్లు

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:19 AM

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ అరంగేట్ర పేసర్‌ సకీబ్‌ ఖాన్‌ (7/130) అదరగొట్టాడు. దీంతో లంక గురువారం తొలి ఇన్నింగ్స్‌లో..

సకీబ్‌ ఖాన్‌కు ఏడు వికెట్లు

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 446

పాక్‌తో మొదటి టెస్టు

రావల్పిండి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ అరంగేట్ర పేసర్‌ సకీబ్‌ ఖాన్‌ (7/130) అదరగొట్టాడు. దీంతో లంక గురువారం తొలి ఇన్నింగ్స్‌లో 446 పరుగులకు ఆలౌటైంది. అలాగే శ్రీలంకకు 12 పరుగుల ఆధిక్యం మాత్ర మే దక్కింది. శతకాలతో జోరు మీదున్న ధనంజయ డిసిల్వ (167), కుశాల్‌ మెండిస్‌ (119)లను సకీబ్‌ త్వరగానే పెవిలియన్‌కు చేర్చడంతో లంక కోలుకోలేకపోయింది. 42 పరుగులతేడాతో చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. ఇక నాలుగో రోజు వెలుతురులేమితో ఆట ముగిసే సమయానికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 57/1 స్కోరుతో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 434/9 స్కోరుతో డిక్లేర్‌ చేసిన పాక్‌ ప్రస్తుతం 45 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 02:19 AM