హైదరాబాద్ X ఆంధ్ర
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:51 AM
తెలుగు జట్లు ఆంధ్ర, హైదరాబాద్ రంజీ ట్రోఫీలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం నుంచి ఇక్కడ జరిగే పోరులో...
రంజీ రౌండ్-2
నేటి నుంచి
ఛత్తీస్‌గఢ్‌తో పంజాబ్ ఢీ
ప్రత్యేక ఆకర్షణగా గిల్
మూలపాడు: తెలుగు జట్లు ఆంధ్ర, హైదరాబాద్ రంజీ ట్రోఫీలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం నుంచి ఇక్కడ జరిగే పోరులో ఆతిథ్య ఆంధ్రతో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి పోరులో త్రిపురపై ఇన్నింగ్స్ విజయం సాధించిన హైదరాబాద్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకొంటోంది. స్పిన్నర్ తన య్ త్యాగరాజన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు బలమైన కర్ణాటకతో డ్రా చేసుకొని.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 3 పాయింట్లు దక్కించుకొన్న ఆంధ్ర కూడా ఫుల్ జోష్‌లో ఉంది. ఇక, టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. గ్రూప్-బిలోనే ఆదివారం నుంచి చండీగఢ్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ తరఫున గిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. గిల్‌కు న్యూజిలాండ్ పర్యటనకు ముందు రెడ్‌బాల్ ప్రాక్టీస్‌గా ఈ మ్యాచ్ ఉపయోపడనుంది. ఇతర మ్యాచుల్లో సౌరాష్ట్రతో కర్ణాటక, హిమాచల్‌తో ముంబై, గుజరాత్‌తో ఢిల్లీ ఆడతాయి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా
యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!