Share News

హాఫ్ సెంచరీతో రాణించిన ధ్రువ్.. రాజస్థాన్ స్కోర్ 210

ABN , Publish Date - Apr 04 , 2026 | 09:22 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ధ్రువ్ జురేల్(75), యశస్వి జైస్వాల్(55) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

హాఫ్ సెంచరీతో రాణించిన ధ్రువ్.. రాజస్థాన్ స్కోర్ 210
Rajasthan Royals score 210

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇవాళ(శనివారం) రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ధ్రువ్ జురేల్(75), యశస్వి జైస్వాల్(55) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ (18 బంతుల్లో 31) ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు.


రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‍కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 6.2 ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ పెవిలియన్ చేరాడు. అర్ధ సెంచరీ చేసి ఫామ్ లో ఉన్న జైస్వాల్‌ను రబాడ ఔట్ చేశాడు. మిడిలార్డర్‌లో వచ్చిన ధ్రువ్ జురేల్(42 బంతుల్లో 75) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ చివరి వరకు ఉన్న ధ్రువ్.. 19.3 ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. హెట్‌మెయర్ 18 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ రెండు వికెట్లు సాధించాడు. అలానే మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ క్రిష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ ముందు 211 భారీ టార్గెట్ ఉంది.


ఇవి కూడా చదవండి:

సచిన్ తనయుడు అద్భుత బౌలింగ్.. స్టంప్స్ ఎగిరాయి.. వీడియో!

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘన విజయం

Updated Date - Apr 04 , 2026 | 09:56 PM