Share News

విరాట్ కోహ్లీ సరసన చేరిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

ABN , Publish Date - Sep 02 , 2026 | 03:30 PM

క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌2026లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెన‌ర్‌, బార్బడోస్ ట్రైడెంట్స్ ప్లేయ‌ర్ క్వింట‌న్ డికాక్ సూప‌ర్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు.

విరాట్ కోహ్లీ సరసన చేరిన  సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్
Quinton de Kock century

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన దూకుడైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. అలానే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే కొందరు ఆటగాళ్లు కోహ్లీ రికార్డులను బ్రేక్ చేయడం లేదా సమం చేయడం చేస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ కూడా కోహ్లీ రికార్డును సమం చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026 జరుగుతోంది. సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్.. బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో డికాక్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా వార్న‌ర్ పార్క్ వేదిక‌గా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌(St Kitts & Nevis Patriots)తో జ‌రిగిన మ్యాచ్‌లో డికాక్ అద్భుత సెంచ‌రీతో అదరగొట్టాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి... కేవ‌లం 57 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన మూడో ప్లేయ‌ర్‌గా దిగ్గ‌జ క్రికెట‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, విరాట్ కోహ్లీ రికార్డును స‌మం చేశాడు.


కోహ్లీ, వార్నర్, డికాక్ ఇప్ప‌టివ‌ర‌కు టీ20ల్లో తలో ప‌ది సెంచ‌రీలు సాధించారు. ఈ ఫీట్‌ను కోహ్లీ కేవ‌లం 413 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. డికాక్‌ 443 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ ఫీట్ అందుకునేందుకు డేవిడ్ వార్నర్‌కు 439 ఇన్నింగ్స్‌లు పట్టాయి. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్(22) అగ్ర‌స్థానంలో ఉండ‌గా.. పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం(13) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక సీపీఎల్ మ్యాచ్ విషయానికి వస్తే.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌.. బార్బడోస్ ట్రైడెంట్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

రేపే బీసీసీఐ రివ్యూ మీటింగ్.. గంభీర్, అగార్కర్‌‌కు బోర్డు నుంచి పిలుపు!

అఫ్గాన్ సిరీస్: సంజు వచ్చాడు.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కేనా..?

Updated Date - Sep 02 , 2026 | 03:47 PM