సౌత్‌జోన్ టీ20 కెప్టెన్‌గా ప్రణవి
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:39 AM
బీసీసీఐ సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టీ20 ట్రోఫీలో పాల్గొనే సౌత్‌జోన్ జట్టుకు హైదరాబాద్ అమ్మాయి ప్రణవి చంద్ర కెప్టెన్‌గా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బీసీసీఐ సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టీ20 ట్రోఫీలో పాల్గొనే సౌత్‌జోన్ జట్టుకు హైదరాబాద్ అమ్మాయి ప్రణవి చంద్ర కెప్టెన్‌గా, శుభా సతీష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. శనివారం హైదరాబాద్‌లో సౌత్‌జోన్ కన్వీనర్, ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి సానా సతీష్ బాబు అధ్యక్షతన సమావేశమైన సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. హైదరాబాద్ క్రికెటర్ వంకా పూజ, ఏపీకి చెందిన శ్రీచరణి, హెన్రీటా పెరీరా, షబ్నం, రంగలక్ష్మి జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కమిలిని (వికెట్ కీపర్), హేమలత, నిక్కీ ప్రసాద్, శ్రీయ, నియా నజీన్, శ్రేయాంక పాటిల్, మోనిక, కవిషకు జట్టులో స్థానం లభించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లాండ్ ఫార్మా లాభం రూ.291 కోట్లు
For More Business News And Telugu News