హైదరాబాద్ టీ20 కెప్టెన్ ప్రణవి
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:57 AM
బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టుకు వెలగపూడి ప్రణవిచంద్ర కెప్టెన్‌గా ఎంపికైంది..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టుకు వెలగపూడి ప్రణవిచంద్ర కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ మేరకు 15మంది సభ్యులతో కూడిన జట్టును హెచ్‌సీఏ మహిళా సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఈనెల 26 నుంచి పుణెలో ఈ పోటీలు జరగనున్నాయి. గతంలో మూడేళ్లపాటు హైదరాబాద్ జట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రణవి... సౌత్‌జోన్ జట్టుకు ఎంపికై టీ20లో, మల్టీ డే ఫార్మాట్‌లోనూ ఆడింది. ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడో్‌సకు, అలాగే యూకేలో ఎర్లింగ్ క్లబ్ తరపున బరిలోకి దిగింది.
జట్టు: ప్రణవిచంద్ర (కెప్టెన్), మమత (వైస్ కెప్టెన్-వికెట్ కీపర్), త్రిష, ధ్రుతి, యశశ్రీ, పూజ, సంధ్య, నితీష, సాక్షి రావు, కావ్య శ్రీ, సృజన, క్రాంతి రెడ్డి, నిధి (వికెట్ కీపర్), పార్వతి, కృష్ణవేణి. స్టాండ్‌బైలుగా త్రిషా పూజిత, శ్రీవల్లి, బిళ్విక, శివానీ గౌడ్, లక్ష్మి ఎంపికయ్యారు.
ఈ వార్తలూ చదవండి
విండీస్ 171 పరుగులకు ఆలౌట్.. భారత్ లక్ష్యం 172..
వైభవ్‌తో బ్యాటింగ్ చేస్తే ఒత్తిడే ఉండదు: ప్రియాంశ్ ఆర్య