Share News

‘సెలెక్షన్‌’ పగ్గాలుప్రజ్ఞాన్‌ ఓఝాకే..

ABN , Publish Date - Oct 20 , 2026 | 06:35 AM

టీమిండియా మాజీ స్పిన్నర్‌, హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞాన్‌ ఓఝాను చీఫ్‌ సెలెక్టర్‌గా కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది...

‘సెలెక్షన్‌’ పగ్గాలుప్రజ్ఞాన్‌ ఓఝాకే..

సెలెక్టర్‌గా రమేష్‌ పొవార్‌

బీసీసీఐ నిర్ణయం

బెంగళూరు: టీమిండియా మాజీ స్పిన్నర్‌, హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞాన్‌ ఓఝాను చీఫ్‌ సెలెక్టర్‌గా కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు సోమవారం ప్రకటించింది. సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం ఈనెల నాలుగుతో ముగిసిన సంగతి తెలిసిందే. దాంతో ఓఝాను తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. ఇప్పుడు అతడికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. అలాగే ముంబైకి చెందిన రమేష్‌ పొవార్‌ జాతీయ సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ‘అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరంజపేతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) పొవార్‌ను సెలెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా..కొత్త సెలెక్టర్‌ పోస్టుకు ఈనెల 15న ముంబైలో ఇంటర్వ్యూ జరిగినట్టు తెలిసింది. పొవార్‌ కాకుండా టీమిండియా మాజీలు సలీల్‌ అంకోలా, వసీమ్‌ జాఫర్‌, జాకబ్‌ మార్టిన్‌, కానర్‌ విలియమ్స్‌ ఇంటర్వ్యూకి హాజరైనట్టు సమాచారం.

జాతీయ సెలెక్షన్‌ కమిటీ

ప్రజ్ఞాన్‌ ఓఝా (చైర్మన్‌), శివసుందర్‌ దాస్‌, ఆర్‌పీ సింగ్‌, అజయ్‌ రాత్రా, రమేశ్‌ పొవార్‌.

Also Read:

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో

ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే

Updated Date - Oct 20 , 2026 | 06:36 AM