శ్రీలంక ఎదురీత
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:02 AM
టాపార్డర్ మరోసారి విఫలం కావడంతో పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో శ్రీలంక ఎదురీదుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో బుధవారం ఆట ఆఖరికి...
రెండో ఇన్నింగ్స్ 74/3
పాకిస్థాన్‌తో రెండో టెస్ట్
రావల్పిండి: టాపార్డర్ మరోసారి విఫలం కావడంతో పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో శ్రీలంక ఎదురీదుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో బుధవారం ఆట ఆఖరికి 74/3 స్కోరు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి 227 పరుగుల ఆధిక్యం సమర్పించుకున్న పర్యాటక జట్టు ఇంకా 153 రన్స్ వెనుకంజలో ఉంది. చేతిలో ఏడు వికెట్లే ఉన్నాయి. అంతకుముందు ఓవర్‌నైట్ 121/3 స్కోరుతో రెండో రోజు, తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్ 325 పరుగులకు ఆలౌటైంది. ఇక శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే కుప్పకూలిన సంగతి విదితమే.
ఇవి కూడా చదవండి:
20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?
రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!