మహిళా ఉద్యోగితో పాక్ ఆటగాడి అనుచిత ప్రవర్తన
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:25 AM
టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇది చాలదన్నట్టు ఆ జట్టుకు...
కరాచీ: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇది చాలదన్నట్టు ఆ జట్టుకు సంబంధించి ఓ అవమానకర వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ ఆటగాడొకరు తాము బసచేసిన హోటల్ ఉద్యోగినితో అనుచితంగా ప్రవర్తించాడట. ఇందుకు అతడిపై పాకిస్థాన్ జట్టు మేనేజర్ జరిమానా విధించాడట. గత శనివారం పల్లెకెలెలో శ్రీలంకతో జరిగిన సూపర్-8 ఆఖరి మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. హౌస్‌కీపింగ్ సిబ్బందిలోని ఒక మహిళతో ఆ క్రికెటర్ అనుచితంగా ప్రవర్తించాడట.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News