రెండో టెస్టులో శ్రీలంకపై విజయం
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:51 AM
పాకిస్థాన్ క్రికెట్ జట్టు రెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెల్చుకుంది. శుక్రవారం నాలుగో రోజే శ్రీలంకతో ముగిసిన రెండో టెస్టులో...
పాక్‌దే సిరీస్
రావల్పిండి: పాకిస్థాన్ క్రికెట్ జట్టు రెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెల్చుకుంది. శుక్రవారం నాలుగో రోజే శ్రీలంకతో ముగిసిన రెండో టెస్టులో పాక్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సిరీస్‌ను 1-0తో ఖాతాలో వేసుకుంది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు సాధించి గెలిచింది. అవైస్ (32 నాటౌట్), ఆమెర్ జమాల్ (34 నాటౌట్) రాణించారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 98, పాక్ 325 రన్స్ సాధించాయి. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 316 పరుగులు చేసింది. అటు లంక ఒక్క టెస్టు విజయం లేకుండానే ఈ ఏడాదిని ముగించనుంది.
ఇవి కూడా చదవండి:
'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!
ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా