IND VS NZ T20: ముగిసిన కివీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 216
ABN , Publish Date - Jan 28 , 2026 | 08:46 PM
విశాఖ వేదికగా భారత్ తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 215 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్(62), డెవాన్ కాన్వే(42) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి తర్వాత వచ్చిన మిగిలిన బ్యాటర్లు ఆశించిన మేర రాణించలేదు. చివర్లో డారిల్ మిచెల్(18 బంతుల్లో39 పరుగులు) విజృభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 215 పరుగులు చేసింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇవాళ(బుధవారం) విశాఖ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య నాలుగో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ ఓడిన కివీస్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్(36 బంతుల్లో 62) అర్ధ సెంచరీతో రాణించాడు. అతడి తోడు మరో ఓపెనర్ కాన్వే(23 బంతుల్లో 44) కూడా చెలరేగి ఆడాడు. దీంతో వీరిద్దరు తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 100 పరుగులు వద్ద కాన్వేను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం రచిన్ రవీంద్ర కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఫిలిప్స్ 24, చాప్‌మన్ 9, శాంట్నర్11 పరుగులు చేశారు. డారిల్ మిచెల్ చివర్లో టీమిండియా బౌలర్లపై విరుచుకపడ్డాడు. కేవలం 18 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొత్తంగా 7 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 215 పరుగులు చేసింది. ఇక భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా చెరో ఒక వికెట్ సాధించారు. మొత్తంగా విశాఖ మ్యాచులో భారత్ ముందు 216 పరుగులు భారీ టార్గెట్‌ను కివీస్ నిర్దేశించింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు
జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్