కివీస్ జట్టులో రచిన్
ABN , Publish Date - Oct 12 , 2026 | 01:57 AM
ఇటీవల భుజం గాయానికి గురైన ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ జట్టులో పునరాగమనం చేశాడు. అలాగే ఫిన్ అలెన్, లూకీ ఫెర్గూసన్, టిమ్ సైఫర్ట్ కూడా జట్టులోకి వచ్చారు.
అలెన్, ఫెర్గూసన్, సైఫర్ట్ కూడా..
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక
వెల్లింగ్టన్: ఇటీవల భుజం గాయానికి గురైన ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ జట్టులో పునరాగమనం చేశాడు. అలాగే ఫిన్ అలెన్, లూకీ ఫెర్గూసన్, టిమ్ సైఫర్ట్ కూడా జట్టులోకి వచ్చారు. ఈమేరకు భారత్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు కివీస్ జట్టును ఆదివారం ప్రకటించారు. వన్డేల తర్వాత ఇరుజట్లు రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో తలపడనున్నాయి. దాంతో టెస్ట్‌ల్లో పాల్గొనే ఎనిమిదిమంది క్రికెటర్లను చివరి రెండు వన్డేల నుంచి తప్పించారు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వచ్చేనెల నాలుగున మొదలు కానుంది.
ప్రత్యేక జెర్సీ ఆవిష్కరణ: భారత్-న్యూజిలాండ్ మధ్య క్రీడా సంబంధాలకు 100 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో వన్డే సిరీస్‌కు ప్రత్యేక జెర్సీని ఆవిష్కరించారు. భారత జాతీయ పుష్పం తామర పువ్వుతోపాటు, సంప్రదాయ మవోరి నమూనాలతో కూడిన ప్రత్యేక జెర్సీని ఇరుదేశాల సంస్కృతులకు అద్దంపట్టేలా రూపొందించారు. ఈ ప్రత్యేక జెర్సీకి న్యూజిలాండ్ క్రికెట్ ‘కోటహిటంగ వన్డే షర్ట్’గా పేరు పెట్టింది.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ ధనాధన్
టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు