సైఫర్ట్ ఫటాఫట్
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:17 AM
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ ఓటమితో ముగించింది. కివీస్ ఓపెనర్ టిమ్ సైఫర్ట్ (50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 93) భారత బౌలర్లపై విరుచుకుపడగా..
ఆఖరి టీ20లోనూ భారత్‌పై
చెలరేగిన ఫిలిప్స్
మిల్నేకు నాలుగు వికెట్లు
హామిల్టన్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ ఓటమితో ముగించింది. కివీస్ ఓపెనర్ టిమ్ సైఫర్ట్ (50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 93) భారత బౌలర్లపై విరుచుకుపడగా.. గ్లెన్ ఫిలిప్స్ (38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 నాటౌట్) ఈ సిరీ్‌సలో నాలుగో హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఆదివారం జరిగిన ఆఖరి పోరులో కివీస్ 7 వికెట్లతో గెలిచింది. తొలి మూడు మ్యాచ్‌లు నెగ్గిన టీమిండియా ఇప్పటికే 3-2తో సిరీస్ గెలుచుకుంది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 191/8 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61), శ్రేయాస్ అయ్యర్ (23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50), నమన్ ధిర్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) రాణించారు. పేసర్లు ఆడమ్ మిల్నేకు 4.. స్మిత్, టిక్నెర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్ 18 ఓవర్లలో 195/3 స్కోరు చేసి గెలిచింది. డారిల్ మిచెల్ (16 బంతుల్లో 4 సిక్సర్లతో 29) వేగంగా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా సైఫర్ట్, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఫిలిప్స నిలిచారు.
దంచుడే: తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్రభావం చూపని సైఫర్ట్ సెడాన్ పార్క్‌లో దుమ్మురేపాడు. అతడికి జతగా ఫిలిప్స్ ఎడాపెడా షాట్లతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఆలెన్ (2) రెండో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. అయితే ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సైఫర్ట్ 13 రన్స్ వద్ద ఇచ్చిన క్యాచ్‌ను నమన్ వదిలేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతను భువీ ఓవర్‌లో 4,6,6,4తో 20 రన్స్ రాబట్టాడు. అలాగే ఓ సిక్సర్‌తో సైఫర్ట్ 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అటు మిచెల్‌తో కలిసి సైఫర్ట్ రెండో వికెట్‌కు 73 రన్స్ జోడించాడు. ఇక ఫిలిప్స్ రాకతో స్కోరు పెరిగింది. అయితే కెరీర్‌లో తొలి సెంచరీకి చేరువలో ఉన్న సైఫర్ట్‌ను 16వ ఓవర్‌లో నితీశ్ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో ఎండ్‌లో 29 బంతుల్లో ఫిఫ్టీ చేసిన ఫిలిప్స్ 17వ ఓవర్‌లో 6,4,4తో 15 రన్స్ రాబట్టాడు. అంతేకాకుండా రెండు వరుస ఫోర్లతో 12 బంతులుండగానే జట్టును గెలిపించాడు.

ఇషాన్, శ్రేయాస్ హాఫ్ సెంచరీలు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో ఇషాన్, శ్రేయాస్ మాత్రమే కివీస్ బౌలర్లను దీటుగా ఆడారు. చివర్లో నమన్ బ్యాట్ ఝుళిపించినా స్కోరు 200లోపే పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ (1), శాంసన్ (4) తొలి నాలుగు ఓవర్లలోను వెనుదిరిగారు. ఈ దశలో ఇషాన్, శ్రేయాస్ మూడో వికెట్‌కు 93 పరుగులు జత చేశారు. ఈ జోడీ క్రీజులో ఉన్నంత సేపు పరుగుల వరద పారింది. 28 బంతుల్లో ఇషాన్, 22 బంతుల్లో శ్రేయాస్ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. పదో ఓవర్‌లో అయ్యర్ 6,4,6 ఇషాన్ 6,4తో 27 రన్స్ సమకూరాయి. దీంతో 220 స్కోరు కూడా ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత వరుస ఓవర్లలో ఇద్దరూ అవుట్ కావడం దెబ్బతీసింది. తిలక్ (6) సైతం నిరాశపర్చగా.. చివర్లో నమన్-నితీశ్ (22) ఆరో వికెట్‌కు 46 పరుగులు జత చేసి ఫర్వాలేదనిపించారు.
స్కోరుబోర్డు
భారత్: శాంసన్ (సి) బ్రేస్‌వెల్ (బి) మిల్నే 4, అభిషేక్ (సి) మిచెల్ (బి) మిల్నే 1, ఇషాన్ (సి) స్మిత్ (బి) టిక్నెర్ 61, శ్రేయాస్ (సి) సైఫర్ట్ (బి) స్మిత్ 50, తిలక్ (సి అండ్ బి) స్మిత్ 6, నమన్ (సి) బ్రేస్‌వెల్ (బి) టిక్నెర్ 33, నితీశ్ (సి) ఫిలిప్స్ (బి) మిల్నే 22, భువనేశ్వర్ (సి) మిచెల్ (బి) మిల్నే 6, ప్రిన్స్ (నాటౌట్) 0, అర్ష్‌దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 191/8. వికెట్ల పతనం: 1-2, 2-19, 3-112, 4-123, 5-133, 6-179, 7-185, 8-190. బౌలింగ్: డఫీ 3-0-27-0, మిల్నే 4-0-19-4, స్మిత్ 3-0-28-2, టిక్నెర్ 4-0-38-2, శాంట్నర్ 4-0-39-0, బ్రేస్‌వెల్ 2-0-38-0.
న్యూజిలాండ్: సైఫర్ట్ (బి) నితీశ్ 93, ఆలెన్ (సి) ఇషాన్ (బి) అర్ష్‌దీప్ 2, మిచెల్ (సి) అభిషేక్ (బి) వరుణ్ 29, ఫిలిప్స్ (నాటౌట్) 65, జాకబ్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 18 ఓవర్లలో 195/3. వికెట్ల పతనం: 1-9, 2-82, 3-168. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-41-0, అర్ష్‌దీప్ 4-0-40-1, ప్రిన్స్ 3-0-35-0, వరుణ్ 4-0-45-1, నితీశ్ 2-0-19-1, అభిషేక్ 1-0-13-0.
1
ఓ క్యాలెండ్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు (400) బాదిన జట్టుగా భారత్
1
ద్వైపాక్షిక సిరీస్‌లో ఎక్కువ పరుగులు (341) చేసిన బ్యాటర్‌గా గ్లెన్ ఫిలిప్స్
1
టీ20 పవర్‌ప్లేల్లో ఎక్కువ వికెట్లు (65) తీసిన బౌలర్‌గా సౌథీతో సమంగా నిలిచిన అర్ష్‌దీప్
3
భారత్ తరఫున టీ20ల్లో వేగం (1345 బంతుల్లో)గా 2000 రన్స్ పూర్తి చేసిన మూడో బ్యాటర్‌గా ఇషాన్. అభిషేక్ (1024), సూర్యకుమార్ (1164) ముందున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం