Share News

సిరాజ్‌పై వేటెందుకు?: మాజీల విమర్శ

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:13 AM

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను పక్కనబెట్టడాన్ని భారత మాజీ ఆటగాళ్లు తప్పుబట్టారు. బుమ్రాతో పాటు...

సిరాజ్‌పై వేటెందుకు?: మాజీల విమర్శ

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను పక్కనబెట్టడాన్ని భారత మాజీ ఆటగాళ్లు తప్పుబట్టారు. బుమ్రాతో పాటు ప్రసిద్ధ్‌, ఆకాశ్‌, అన్షుల్‌ రూపంలో నలుగురు పేసర్లను జట్టు బరిలోకి దింపింది. అయితే సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదని, ఐదో వన్డేలో తను వికెట్లు తీసిన విషయం మర్చిపోరాదని గవాస్కర్‌ గుర్తుచేశాడు. పేస్‌, సీమ్‌, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే సిరాజ్‌ను ఎందుకు వదిలేసినట్టు? అని రవిశాస్త్రి ప్రశ్నించాడు. అలాగే సిరాజ్‌ జట్టులో లేకపోవడం నిరాశకు గురిచేసిందని మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ తెలిపాడు. అయితే తొలి టెస్టు కోసం సిరాజ్‌ను పక్కనబెట్టడం తప్పుడు నిర్ణ యం కాదని బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్‌ సమర్థించుకున్నాడు. కేవలం మొదటి రోజు కోసమే టీమ్‌ ఎంపిక ఉండదని తేల్చాడు.

ఇవి కూడా చదవండి:

భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5

టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..

Updated Date - Nov 20 , 2026 | 04:13 AM