Share News

అంతర్జాతీయ క్రికెట్‌కు ఉడ్‌, ఇన్‌గ్రామ్‌ వీడ్కోలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:18 AM

ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ ఉడ్‌ (36) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 11 ఏళ్ల కెరీర్‌లో రెండు వరల్డ్‌క్‌పలు, ఓ యాషెష్‌ సిరీస్‌ నెగ్గాడు...

అంతర్జాతీయ క్రికెట్‌కు ఉడ్‌, ఇన్‌గ్రామ్‌ వీడ్కోలు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ ఉడ్‌ (36) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 11 ఏళ్ల కెరీర్‌లో రెండు వరల్డ్‌క్‌పలు, ఓ యాషెష్‌ సిరీస్‌ నెగ్గాడు. మార్క్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి ఆడిన 146 మ్యాచ్‌ల్లో 253 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌ తరఫున ఆడిన 38 టెస్ట్‌ల్లో 119 వికెట్లు సాధించాడు. గతేడాది ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌ ఆడాడు. కాగా, దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్‌ కొలిన్‌ ఇన్‌గ్రామ్‌ (41) కూడా ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన 13 ఏళ్ల తర్వాత కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 05:18 AM