సచినా.. కాంబ్లీనా?
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:10 AM
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్‌పై దిగ్గజం కపిల్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, అతడు కెరీర్‌లో సచిన్‌లా ఎదుగుతాడా? లేదంటే వినోద్ కాంబ్లీలా మారిపోతాడా...
వైభవ్‌పై కపిల్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్‌పై దిగ్గజం కపిల్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, అతడు కెరీర్‌లో సచిన్‌లా ఎదుగుతాడా? లేదంటే వినోద్ కాంబ్లీలా మారిపోతాడా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుందన్నాడు. ‘15 ఏళ్ల వైభవ్ దూకుడుగా ఆడుతుంటే చూడముచ్చటేస్తోంది. అతడిలో అద్భుత ప్రతిభ ఉంది. కానీ, రెగ్యులర్ ప్లేయర్‌గా మారేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అవకాశం వచ్చేంత వరకు అతడు వేచిచూడాలి. ఇక, ‘ఈ వయసులో వైభవ్‌కు అంతా క్రికెట్టే. కానీ, మరో మూడు నాలుగేళ్ల తర్వాత పరిస్థితులు మారిపోతాయి. డబ్బు, ప్రచారం రావడంతో ఆట నుంచి దృష్టిమరలే అవకాశం కూడా ఉంది. అప్పుడు తనను తాను అతడు ఎలా నియంత్రించుకొంటాడనేది ముఖ్యం. సచిన్‌లా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడా? లేదంటే కాంబ్లీలా కెరీర్‌ను చేజేతులా చెడగొట్టుకుంటాడా? చూద్దాం’ అని కపిల్ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌లో ఎంతో ప్రతిభావంతులు, స్నేహితులైన సచిన్, కాంబ్లీ జీవన విధానాలు యువతకు నిజంగా గుణపాఠం. క్రమశిక్షణతో మాస్టర్ ఆటలో శిఖరాలను అందుకొంటే.. గతితప్పిన జీవనశైలి కారణంగా కాంబ్లీ అథఃపాతాళానికి కూరుకుపోవడం అందరికీ తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం
ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం